Saturday, March 15, 2008

ఐ.ఐ.టి - ఐ.టి.ఐ

మా మిత్రుడొకరికి, ఐ.ఐ.టి బాంబే లో సీటు వచ్చింది. బాంబే వెళ్లబోయే ముందు బట్టలు కుట్టించుకోడానికి వాళ్ల ఇంటి దగ్గరున్న టైలరుకు దగ్గరకు వెళ్లాడు. అప్పుడు వారి మద్య జరిగిన సంభాషణ ఇది.

టైలరు: చదువుకోడానికి బొంబాయి వెళ్తున్నావటగా?

మిత్రుడు: అవును ఐ.ఐ.టి బొంబాయిలో సీటొచ్చింది.

టైలరు: ఇంకొంచం కష్టపడి చదివితే గుంటూరు డాన్ బాస్కో ఐ.టి.ఐ లోనే సీటొచ్చేది కదా. మీవాళ్లు నిన్నంత కష్టపడి చదివిస్తోంటే నువ్వామాత్రమైనా చదవకపోవడం ఏం బాగాలేదు.

అంతే మావాడు తరువాత ఇంకెప్పుడు ఆ టైలరు దగ్గరకు వెళ్లలేదు

Friday, March 14, 2008

అమితాబ్‌ బయోడేటా

పేరు: అమితాబ్‌ బచ్చన్‌
వయస్సు: మేకప్‌ ఉన్నప్పుడా? లేనప్పుడా ?

వృత్తి: సినిమాల్లో నటించడం
హాబీలు: పూజలు, యాగాలు(తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ కోసం)

స్నేహితులు: అమర్‌ సింగ్‌, బాంబే బడా పారిశ్రామిక వేత్తలు

శత్రువులు: యువ కథానాయకులు
ఇష్టం: నటించడం, యాడ్‌లలో రెండు డైలాగులు చెప్పి భారీ రిన్యుమరేషన్‌ పొందడం
ఇష్టమైన స్థలం: ప్రస్తుతం షారుఖ్‌ ఖాన్‌ కూర్చొంటున్న సీటు
నచ్చిన సినిమా: అభిషేక్‌-ఐశ్వర్యా రాయ్‌ చిత్రాలు
విశ్వాసం: జ్యోతిష్యులపైన
అవిశ్వాసం: కాంగ్రెస్‌ నాయకులపై
ఇటీవల కలతకు గురిచేసిన అంశం: కాబోయే కోడలు ఐశ్వర్యా రాయ్‌కి అంగారక దోషం ఉందన్న విషయం
ఇటీవల లభించిన పెద్ద గిఫ్ట్‌: రోల్స్‌రాయ్స్‌ కార్‌
ఇటీవల అందిన తీపి కబురు: కొందరు తనను రాష్ట్రపతి పదవికి సిఫార్సు చేయడం
సుదీర్ఘ ప్రస్థానం: రిటైర్మెంట్‌ తీసుకోకుండా సినిమాల్లో నటిస్తుండడం...

source: http://sify.com/telugu/jokes/fullstory.php?id=14394674

దెబ్బపై దెబ్బ

రాము: బిజినెస్‌ను నేను మరో భార్యగా భావిస్తా.
సోము: బిజినెస్‌ పట్ల మీకు అంత ఇష్టమా ?
రాము: కాదు..బిజినెస్‌లో నాకు దెబ్బపై దెబ్బ తగులుతోంది
సోము: ...!!!! ?

ధృడమైన వేదిక

మేము భరతనాట్యం నేర్చుకోవాలనుకొంటున్నాం. మాకు ఉండాల్సిన అర్హతలేంటి ?

1)మీకు ధృడమైన ఆత్మస్థైర్యం ఉండాలి.

2)రెండోది వేదిక ధృడమైన కట్టడంగా ఉండాలి

దొంగ- నిద్ర

పోలీస్‌: దొంగిలించిన తర్వాత ఆ ఇంటిలోనే ఎందుకు నిద్రపోయావ్‌ ?

దొంగ: అంత డబ్బు, నగలతో రాత్రిపూట బయటికెళ్లడం మంచిది కాదని...!

పోలీస్‌: ...!!! ?

కంటికి కనిపించని ప్రాణి

టీచర్‌: మన కంటికి కనిపించని ఓ ప్రాణిని చెప్పు ?
స్టూడెంట్‌: మన నియోజకవర్గ ఎమ్మెల్యే, మేడమ్‌!

కుక్క తోక .......

జేబు దొంగ జగ్గారావును కోర్టులో హాజరుపరిచారు .


సాక్షాదారాలన్నీపరిశీలించిన మీదట నేరస్తునికి ఆరు నెలలు జైలుశిక్ష గాని రెండువేలు జరిమానాగాని విదిస్తున్నట్లు తీర్పు వెలువడింది.

"ఊ .... చెప్పు, జైలుకి వెళ్తావా? జరిమానా కడతావా ? " ప్రశ్నించాడు న్యాయమూర్తి .


'జరిమానా కడతా ' చెప్పాడు జగ్గారావు .

చటిలో డబ్బులు ఉన్నాయా మరి ?

లేవుగానీ చిటికలో తెస్తా . ఓ అరగంట

Sunday, March 2, 2008

ఆఫీసు


కిషోర్ :నేను వచ్చే వారం ఉద్వోగానికి రాజీనామా చేస్తున్నానని చెబితే మా బాస్ ఎంత బాధపడ్డాడో !
రాజు : బహుశా ఈ వారమే వేళీ పోతావని అనుకొని ఉంటాడు .